- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్ర మంత్రికి కరోనా
by B.Srinivas |
<p>మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన్ను థానేలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. భద్రతా సిబ్బందిలో కొందరికి కరోనా సోకడంతో మంత్రి సహా తన కుటుంబ సభ్యులు వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తరువాత జరిపిన పరీక్షలో నెగెటివ్ అనే తేలింది. అయితే మంత్రి ఇటీవల మూంబ్రా పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారులతో లాక్ డౌన్‌పై సమీక్షించారు. ఈ సమావేశం నిర్వహించడం వల్లే మంత్రికి కరోనా సోకిందని అధికారులు భావిస్తున్నారు. […]</p>

X
మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన్ను థానేలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. భద్రతా సిబ్బందిలో కొందరికి కరోనా సోకడంతో మంత్రి సహా తన కుటుంబ సభ్యులు వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తరువాత జరిపిన పరీక్షలో నెగెటివ్ అనే తేలింది. అయితే మంత్రి ఇటీవల మూంబ్రా పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారులతో లాక్ డౌన్‌పై సమీక్షించారు. ఈ సమావేశం నిర్వహించడం వల్లే మంత్రికి కరోనా సోకిందని అధికారులు భావిస్తున్నారు. ఈ మీటింగ్‌లో పాల్గొన్న ఓ పోలీస్ అధికారికి కూడా పాజిటివ్ అని తేలింది. ఈ అధికారి తబ్లిగీ జమాత్ సభ్యుల సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొని 13 బంగ్లాదేశీయులు, 8 మంది మలేషియన్లను అరెస్ట్ చేశారు. దీంతో పోలీస్ అధికారి నుంచి మంత్రికి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది.
Tags: maharastra, minister, avadh, carona, positive
Next Story






