గుజరాత్‌ సీఎంను కలిసిన ఎమ్మెల్యేకు కరోనా..

by B.Srinivas |

<p>గాంధీనగర్: గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే‌ ఇమ్రాన్ ఖేడావాలాకు కరోనా సోకడం తీవ్ర కలకలం రేపింది. అయితే, ఈ ఎమ్మెల్యే సీఎం విజయ్ రుపానీతో పాటు మరో ఇద్దరు మంత్రులతో మంగళవారం భేటీ అవ్వడం గమనార్హం. భేటీ అయిన గంట తరువాత కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమ్మెల్యే‌ను ఆస్పత్రికి తరలించి, ఆయనతో సన్నిహితంగా ఉన్నవారిని ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కు పంపించారు. ఇమ్రాన్ ఖేడావాలా కొన్ని రోజుల నుంచి తీవ్ర జ్వరంతో [&hellip;]</p>

గుజరాత్‌ సీఎంను కలిసిన ఎమ్మెల్యేకు కరోనా..
X

గాంధీనగర్: గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే‌ ఇమ్రాన్ ఖేడావాలాకు కరోనా సోకడం తీవ్ర కలకలం రేపింది. అయితే, ఈ ఎమ్మెల్యే సీఎం విజయ్ రుపానీతో పాటు మరో ఇద్దరు మంత్రులతో మంగళవారం భేటీ అవ్వడం గమనార్హం. భేటీ అయిన గంట తరువాత కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమ్మెల్యే‌ను ఆస్పత్రికి తరలించి, ఆయనతో సన్నిహితంగా ఉన్నవారిని ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కు పంపించారు.

ఇమ్రాన్ ఖేడావాలా కొన్ని రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా, కరోనా పరీక్షల కోసం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. ఇందుకు సంబంధించిన రిపోర్టులు రాకముందే బాధ్యతారాహిత్యంగా, నిబంధనలు అతిక్రమించి బయట తిరిగారు. కాగా, సీఎంతో ఎమ్మెల్యే భేటీకి సంబంధించిన వీడియోను అధికారులు విడుదల చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారంతా సోషల్ డిస్టెన్స్ పాటించినట్లు తెలుస్తోంది.

Tags: mla, cm, meeting, corona, gujarat

Next Story