పెళ్లి చూపుల్లో కరోనా కలకలం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి చూపులకు వెళ్లిన అమ్మాయి కుటుంబసభ్యుల్లో కరోనా కలకలం సృష్టించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా యర్రంశెట్టి పాలెం గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే..యర్రంశెట్టి పాలెంకు చెందిన పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు ఇదివరకే కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టుల రావాల్సి ఉన్నది. అయితే, ఈ క్రమంలోనే ఆ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు పెళ్లి చూపులకు వెళ్లారు. అదే సమయంలో వైద్యాధికారులు ఈ కుటుంబంలో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. దీంతో పాజిటివ్ [&hellip;]</p>

పెళ్లి చూపుల్లో కరోనా కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి చూపులకు వెళ్లిన అమ్మాయి కుటుంబసభ్యుల్లో కరోనా కలకలం సృష్టించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా యర్రంశెట్టి పాలెం గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే..యర్రంశెట్టి పాలెంకు చెందిన పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు ఇదివరకే కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టుల రావాల్సి ఉన్నది. అయితే, ఈ క్రమంలోనే ఆ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు పెళ్లి చూపులకు వెళ్లారు. అదే సమయంలో వైద్యాధికారులు ఈ కుటుంబంలో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. దీంతో పాజిటివ్ వచ్చిన వ్యక్తులను అధికారులు వెంటనే హోం క్వారంటైన్‌కు తరలించారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

Next Story