శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్

by  |
శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ముప్పు ఇంకా వదలలేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. భూతంలా వెంటాడుతోంది. ఇప్పటికే సాధారణ ప్రజల నుంచి రాజకీయ ప్రముఖులు, సెబ్రెటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా తమిళ హీరో ఒకరికి కొవిడ్-19 వైరస్ సోకింది. తమిళ సినీ నటుడు శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన సతీమణి రాధికా శరత్‌కుమార్‌, తనయ వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. కరోనా లక్షణాలు ఏమీ లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్నారు. శరత్ కుమార్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్‌’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Next Story

Most Viewed