బిగ్ బ్రేకింగ్.. మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్

by  |
బిగ్ బ్రేకింగ్.. మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. సామాన్యులకే కాకుండా ప్రముఖులు సైతం అనేక మంది ఇప్పటికే కరోనా బారినపడుతున్నారు. గత రెండ్రోజులుగా టీఆర్ఎస్ కీలక నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, ఆలేరు ఎమ్మెల్యే దంపతులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతేగాకుండా.. ఇటీవల తనను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, కరోనా టెస్టులు చేయించుకొని ఐసోలేషన్‌లోకి వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు.

Next Story

Most Viewed