- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా
by Shyam |
<p>దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలో ఒక కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినట్టు శుక్రవారం డేంకేశ్వర్ మెడికల్ ఆఫీసర్ గంగారెడ్డి తెలిపారు. నందిపేట మండలం నికాల్పూర్ గ్రామంలో ఏడుగురికి కరోనా ర్యాపిడ్ టెస్టులు చేయగా, ఇందులో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కాగా వీరందరూ ఒకే కుటుంబంలోని నలుగురిలో ఇద్దరు మగవారికి, ఇద్దరు ఆడవారికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఒక్కసారి మండలంలోని ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. ఇంటి యజమాని డయాలసీస్ పేషెంట్ అని వారానికి […]</p>

X
దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలో ఒక కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినట్టు శుక్రవారం డేంకేశ్వర్ మెడికల్ ఆఫీసర్ గంగారెడ్డి తెలిపారు. నందిపేట మండలం నికాల్పూర్ గ్రామంలో ఏడుగురికి కరోనా ర్యాపిడ్ టెస్టులు చేయగా, ఇందులో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కాగా వీరందరూ ఒకే కుటుంబంలోని నలుగురిలో ఇద్దరు మగవారికి, ఇద్దరు ఆడవారికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఒక్కసారి మండలంలోని ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. ఇంటి యజమాని డయాలసీస్ పేషెంట్ అని వారానికి ఒకసారి జిల్లా కేంద్రంలో డయాలసిస్ చేసుకుంటారని, అయితే ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో ఆయనకు కాంటాక్ట్‌లో ఉన్న ఈ కుటుంబ సభ్యులకు సోకి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. నలుగురిని కోవిడ్ ఆసుపత్రికి తరలించామని, ప్రైమరీ, సేకండరీ కాంటాక్ట్ ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.
Next Story






