చార్మి తల్లిదండ్రులకు కరోనా

by  |

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అనేకమంది ప్రముఖులు రోజూ కరోనా బారినపడుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నటి చార్మి తల్లిదండ్రులు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా చార్మి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని తెలిపింది. అంతేగాకుండా ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే… వెంటనే చికిత్సలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story