- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైల్ నిలయంలో 30 మందికి కరోనా..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరినీ వదలడం లేదు. తాజాగా సికింద్రాబాద్ రైల్ నిలయంలో 30 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో సంబంధిత ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. సికింద్రాబాద్ రైల్ నిలయంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 2,500 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 30 మందికి పాజిటివ్ తేలింది. దీంతో ఉన్నతాధికారులు రెండురోజుల పాటు కార్యాలయాన్ని […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరినీ వదలడం లేదు. తాజాగా సికింద్రాబాద్ రైల్ నిలయంలో 30 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో సంబంధిత ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
సికింద్రాబాద్ రైల్ నిలయంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 2,500 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 30 మందికి పాజిటివ్ తేలింది. దీంతో ఉన్నతాధికారులు రెండురోజుల పాటు కార్యాలయాన్ని మూసివేసి శానిటైజేషన్ నిర్ణయించారు. అనంతరం బుధవారం రైల్ నిలయంలో కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also…
Next Story






