- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం దత్తత గ్రామంలో కరోనా కలకలం
by B.Srinivas |
<p>దిశ, మేడ్చల్: జిల్లా పరిధిలోని మూడు చింతలపల్లి మండల కేంద్రంలో తాజాగా కరోనా కేసు నమోదైంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ఈ గ్రామంలో ఓ డెబ్బై ఏళ్ల వృద్ధుడికి గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. వివరాలు ఇలా ఉన్నాయి. మూడు చింతలపల్లిలో నివాసం ఉంటున్న ఓ 70 ఏళ్ల వృద్ధుడు గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కాగా సదరు వ్యక్తిని బుధవారం వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా […]</p>

X
దిశ, మేడ్చల్: జిల్లా పరిధిలోని మూడు చింతలపల్లి మండల కేంద్రంలో తాజాగా కరోనా కేసు నమోదైంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ఈ గ్రామంలో ఓ డెబ్బై ఏళ్ల వృద్ధుడికి గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. వివరాలు ఇలా ఉన్నాయి. మూడు చింతలపల్లిలో నివాసం ఉంటున్న ఓ 70 ఏళ్ల వృద్ధుడు గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కాగా సదరు వ్యక్తిని బుధవారం వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన కుమారుడు తీకువెళ్లాడు. ఆ వృద్ధుడికి కరోనా పరీక్షలు చేయడంతో గురువారం పాజటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. దీంతో వృద్ధుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్యతో పాటు కుమారుడికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి క్వారంటెన్ కేంద్రానికి తరలించారు అధికారులు.
Next Story






