- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో 6,235 పాజిటివ్ కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటివరకు రోజుకు 10వేల చొప్పున నమోదైన కరోనా పాజిటివ్ కేసులు నాలుగురోజులుగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 56,569మందికి పరీక్షలు నిర్వహించగా 6,235మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,31,749కి చేరింది. 51మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 5,410గా ఉంది. ప్రస్తుతం 74,518 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 5,51,821మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 51,60,700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటివరకు రోజుకు 10వేల చొప్పున నమోదైన కరోనా పాజిటివ్ కేసులు నాలుగురోజులుగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 56,569మందికి పరీక్షలు నిర్వహించగా 6,235మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,31,749కి చేరింది. 51మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 5,410గా ఉంది. ప్రస్తుతం 74,518 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 5,51,821మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 51,60,700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.
కరోనా మహమ్మారి బారిన పడి కృష్ణా జిల్లాలో 9మంది ప్రాణాలు కోల్పోగా చిత్తూరులో ఏడుగురు, విశాఖలో ఆరుగురు, అనంతపురంలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు, కర్నూలులో ముగ్గురు, కడపలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, శ్రీకాకుంలో ఒకరు చనిపోయారు.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,262 కరోనా కేసులు నమోదు కాగా పశ్చిమగోదావరి జిల్లాలో 962, ప్రకాశంలో 841, గుంటూరులో 532, అనంతపురంలో 505, నెల్లూరులో 401, విజయనగరంలో 395, చిత్తూరులో 362, శ్రీకాకుళంలో 283, కడపలో 219, కర్నూలులో 190, విశాఖలో 150, కృష్ణాలో 133 పాజిటివ్ కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.






