- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కరోనా @ 4,402
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీని కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వైద్య ఆరోగ్య శాఖ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. గడచిన 24 గంటల్లో 141 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో వివిధ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతూ 59 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం 4,402 కరోనా పాజిటివ్ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీని కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వైద్య ఆరోగ్య శాఖ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. గడచిన 24 గంటల్లో 141 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో వివిధ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతూ 59 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం 4,402 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇందులో 1723 మంది కరోనా కారణంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, మరో 2,599 మంది కరోనా చికిత్స తీసుకుని కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ప్రకటించింది. ఏపీలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 80 మంది మృతి చెందారని తెలిపింది.
Next Story






