ఏపీలో కరోనా @ 303

by Vemula.Srinu Prasad |

<p>ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజు రోజుకీ విస్తరిస్తోంది. ఈ రోజు ఉదయం వైద్య ఆరోగ్యశాక బులెటిన్ విడుదల చేసే సమయానికి 266 కేసులతో విస్తరించిన కరోనా.. సాయంత్రానికి 303 పాజిటివ్ కేసులకు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు ఏపీలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 37 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అటు, కర్నూలు జిల్లాలో కరోనా కలకలం మరింత ఉధృతిగా ఉంది. నిన్న 57 కేసులతో [&hellip;]</p>

ఏపీలో కరోనా @ 303
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజు రోజుకీ విస్తరిస్తోంది. ఈ రోజు ఉదయం వైద్య ఆరోగ్యశాక బులెటిన్ విడుదల చేసే సమయానికి 266 కేసులతో విస్తరించిన కరోనా.. సాయంత్రానికి 303 పాజిటివ్ కేసులకు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు ఏపీలో ముగ్గురు మృత్యువాతపడ్డారు.

ఈ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 37 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అటు, కర్నూలు జిల్లాలో కరోనా కలకలం మరింత ఉధృతిగా ఉంది. నిన్న 57 కేసులతో ఆ జిల్లా వాసులను బెంబేలెత్తించిన కరోనా.. ఈ రోజు 18 కేసులతో తన పరిధిని పెంచుకుంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74కి చేరింది. నెల్లూరు జిల్లాలో కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇవాళ కొత్తగా 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో కరోనా బారిన ఇప్పటి వరకు 42 మంది పడ్డారు. ఒకరు మృత్యువాత పడ్డారు.

గుంటూరు జిల్లాలో 32 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 29 కేసులు నమోదు కాగా, ఇద్దరు మృత్యవాత పడ్డారు. కడప జిల్లాలో 27 మందికి కరోనా సోకింది. ప్రకాశం జిల్లాలో 24 మందికి కరోనా సోకగా ఒకరు మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 21 మందికి కరోనా సోకింది. విశాఖపట్టణం జిల్లాలో 20 మందికి కరోనా సోకగా, ఒకరు మరణించారు.

Tags: Coronavirus, Covid-19, Corona in ap, 303 Corona Cases, Andhra pradesh, Positive Cases,

Next Story