- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లాస్మా థెరపీతో కోలుకున్న కరోనా రోగి
<p>కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఓవ్యక్తికి ప్లాస్మా చికిత్స సత్ఫలితాన్ని ఇచ్చింది. పూర్తిగా కోలుకొని బాధితుడు(49) ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ చికిత్స తీసుకున్నతొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.ఈ నెల 4న తీవ్రమైన జ్వరం, శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న సదరు వ్యక్తి ఢిల్లీలోని సాకేత్ ఏరియా ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలో కరోనా పాజిటిగా తేలింది. రోజురోజుకు పరిస్థితి క్షీణించడంతో వెంటిలెటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో ప్లాస్మా […]</p>

కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఓవ్యక్తికి ప్లాస్మా చికిత్స సత్ఫలితాన్ని ఇచ్చింది. పూర్తిగా కోలుకొని బాధితుడు(49) ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ చికిత్స తీసుకున్నతొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.ఈ నెల 4న తీవ్రమైన జ్వరం, శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న సదరు వ్యక్తి ఢిల్లీలోని సాకేత్ ఏరియా ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలో కరోనా పాజిటిగా తేలింది. రోజురోజుకు పరిస్థితి క్షీణించడంతో వెంటిలెటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో ప్లాస్మా చికిత్స థెరపీ అందించారు. దీంతో రోగి నాలుగు రోజుల్లో కోలుకున్నాడు. దీంతో ఆదివారం అతన్ని డిశ్చార్జి చేశారు. ఇక కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలను ఇస్తోందని సీఎం కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
Tags: carona, patient, discharge, delhi, plasma therapy






