- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రిలో కరోనా పేషెంట్ మాయం.. గ్రామంలో ప్రత్యక్షం
<p>దిశ, వెబ్ డెస్క్: ఆసుపత్రి నుంచి కరోనా పేషెంట్ తప్పిపోయి గ్రామంలో ప్రత్యక్షమైన ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో జిల్లాలో కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ మండల యాద్గార్ గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. దీంతో ఆ మహిళను నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ మహిళ సోమవారం డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది కళ్లుగప్పి ఆస్పత్రి నుంచి పారిపోయింది. అక్కడి నుంచి నేరుగా యాద్గార్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆసుపత్రి నుంచి కరోనా పేషెంట్ తప్పిపోయి గ్రామంలో ప్రత్యక్షమైన ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో జిల్లాలో కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ మండల యాద్గార్ గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. దీంతో ఆ మహిళను నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ మహిళ సోమవారం డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది కళ్లుగప్పి ఆస్పత్రి నుంచి పారిపోయింది. అక్కడి నుంచి నేరుగా యాద్గార్ గ్రామానికి వెళ్లిపోయింది. దీంతో ఆ గ్రామస్తులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడి చేరుకున్న పోలీసులు వైద్య సిబ్బంది సాయంతో 108 వాహనంలో ఆమెను తిరిగి మళ్లీ ఆస్పత్రికి పంపించారు.
Next Story






