తిరుపతిలో కొవిడ్ పేషెంట్ మిస్సింగ్.. వారం రోజులుగా..!

98
tirupathi ruia hospital

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల వలన ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరక్క కొవిడ్ రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఏదో ఒక విషాద ఘటన వెలుగుచూస్తోంది. మొన్నటికి మొన్న ఆక్సిజన్ అందక పదికి పైగా రోగులు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా వారం రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్న గోవిందయ్య అనే రోగి కనిపించకుండా పోయాడు.

అతని ఆచూకీ కోసం బంధువులు ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. అయితే, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అసలు గోవిందయ్య అంటే ఎవరో తెలియదని చెబుతున్నారు. రికార్డు బుక్‌లో అతని పేరు కూడా నమోదు చేయలేదని తెలుస్తోంది. దీంతో అలిపిరి పోలీస్ స్టేషన్‌లో గోవిందయ్య బంధువులు ఫిర్యాదు చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..