గుంటూరులో కరోనా అనుమానిత వ్యక్తి

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-03-20 05:57:35  IST  )

<p>గుంటూరు జిల్లా కేంద్రంలో కరోనా అనుమానిత వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. ప్రకాశం జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ గుంటూరులోని ఆసుపత్రిలో చేరాడు. ఆ వ్యక్తి ఇటీవల హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చినట్టు తెలుస్తోంది. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. అతని రక్షనమూనాలు సేకరించి తిరుపతి ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి వైద్య చికిత్స ఉంటుందని వారు [&hellip;]</p>

గుంటూరులో కరోనా అనుమానిత వ్యక్తి
X

గుంటూరు జిల్లా కేంద్రంలో కరోనా అనుమానిత వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. ప్రకాశం జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ గుంటూరులోని ఆసుపత్రిలో చేరాడు. ఆ వ్యక్తి ఇటీవల హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చినట్టు తెలుస్తోంది. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. అతని రక్షనమూనాలు సేకరించి తిరుపతి ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి వైద్య చికిత్స ఉంటుందని వారు వెల్లడించారు.

tags : guntur, corona virus, 57 years old man, hospitalised

Next Story