- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్వాల ఎమ్మెల్యేకు కరోనా నెగిటివ్
<p>దిశ, మహబూబ్‌నగర్: గద్వాల జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసి వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా గద్వాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ కేశవ్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికీ నెగిటివ్ వచ్చినట్టు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఈ నెల 20న వీరి రక్త నమూనాలను […]</p>

దిశ, మహబూబ్‌నగర్: గద్వాల జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసి వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా గద్వాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ కేశవ్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికీ నెగిటివ్ వచ్చినట్టు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఈ నెల 20న వీరి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు పంపగా, 22న టెస్ట్‌లు చేసిన వైద్యులు.. నెగిటివ్ వచ్చినట్టు వెల్లడించారు. కాగా, జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32కు చేరగా, ఇద్దరు మృతిచెందారు. అలాగే, నలుగురు వ్యక్తులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు.
Tags: Coronavirus, negative report, Gadwal MLA, mahaboobnagar






