దారుణం.. కరోనా సోకిందని మైనర్ బాలికను వెలేసిన గ్రామం

by  |
corona infected minor girl banished from village at karimnagar
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా సోకిన మైనర్ బాలికపై గ్రామస్తులు కనికరం చూపలేదు. ఈ క్రమంలో అన్యాయానికి గురైన సదరు మైనర్‌ను జిల్లా అధికారులు సఖీ కేంద్రానికి తరలించారు. వివరాల ప్రకారం.. సఖీ కేంద్రంలో ఓ మైనర్‌కు ఇటీవల పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని డాక్టర్లు సూచించడంతో సీడబ్లూసీ అధికారుల ఆదేశాల మేరకు.. బాధితురాలిని ఆమె స్వగ్రామానికి తరలించారు.

సఖీ కేంద్రంలో మిగతా బాధితులు కూడా ఉండటంతో ఆమెను అక్కడే క్వారంటైన్ చేసే పరిస్థితి లేనందున.. డాక్టర్లు కూడా హోం ఐసోలేషన్ ఉండాలని సూచించడంతో ఆమెను.. స్వగ్రామమైన తండాకు పంపించారు. అయితే సదరు తండాలో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు అవకపోవడంతో.. వేరే చోట క్వారంటైన్‌లో ఉండాలని అక్కడి ప్రజలు సూచించారు. దీంతో బాధితురాలు.. పొలంలో తాత్కాలిక షెడ్ వేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సిరిసిల్ల జిల్లా అధికారులు హుటాహుటిన తండాకు వెళ్లి బాధితురాలిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.

నిబంధనల ప్రకారమే: సఖీ అడ్మినిస్ట్రేటర్

అయితే సదరు మైనర్ విషయంలో తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని సఖీ అడ్మినిస్ట్రేటర్ రోజా ’దిశ‘కు వివరించారు. సీడబ్లూసీ ఆదేశాల మేరకే ఆమెను పంపించామని, డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్‌కు తరలించామన్నారు.


Next Story

Most Viewed