- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందూర్ లో కరోనా ప్రమాద ఘంటికలు
<p>దిశ ప్రతినిథి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలను మొగిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ కాలంలో మునుపెన్నడు లేనివిధంగా కేసులు బయటపడుతున్నాయి. అధికార యంత్రాంగాలు మాత్రం కేసులు దాచడంలో బిజిగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో కామారెడ్డి జిల్లాలో శనివారం 915 కేసులు బహిర్గతం అయితే, నిజామాబాద్ జిల్లాలో పిహెచ్ సీ వారిగా చూస్తే వచ్చిన కేసుల సంఖ్య 1500 పైచిలుకు. కాని అధికారులు నిజామాబాద్ లో హెల్త్ బులిటేన్ లో 283 కేసులు […]</p>

దిశ ప్రతినిథి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలను మొగిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ కాలంలో మునుపెన్నడు లేనివిధంగా కేసులు బయటపడుతున్నాయి. అధికార యంత్రాంగాలు మాత్రం కేసులు దాచడంలో బిజిగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో కామారెడ్డి జిల్లాలో శనివారం 915 కేసులు బహిర్గతం అయితే, నిజామాబాద్ జిల్లాలో పిహెచ్ సీ వారిగా చూస్తే వచ్చిన కేసుల సంఖ్య 1500 పైచిలుకు. కాని అధికారులు నిజామాబాద్ లో హెల్త్ బులిటేన్ లో 283 కేసులు చూపించడం విస్మయం కలిగిస్తుంది. మరణాల సంఖ్య ను అసలు బహిర్గత పరుచడం లేదు.
అలస్యంగా తెరుకున్న అధికార యంత్రాంగం నిజామాబాద్ జిల్లాలో 1500, కామారెడ్డిలో 1200 పడకల ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా వ్యాధిగ్రస్థులకు చికిత్సలను అందించేందుకు అధికారయంత్రాంగం సన్నహాలు చేస్తుంది. పోలిస్, రెవిన్యూ, పంచాయతీ శాఖాల అధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతునే, మాస్కు ధరించనివారికి పైన్ లు బాధడం షురు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర క్యాంపు, రెంజల్ మండలం తడాబిలోలి నవిపేట మండలం బినోల గ్రామాలలో స్వచ్చందంగా లాక్ డౌన్ విధించుకున్నారు. ఇదివరకు అధికారులు అయా గ్రామాల సరిహద్ధు మహారాష్ట్ర గ్రామాలు కావడంతో వాటిని కంటైన్ మెంట్ జోన్ లుగా గుర్తించగా ఇప్పుడు గ్రామస్థులు సెల్ప్ లాక్ డౌన్ అమలు చేసుకుంటున్నారు.






