తెలంగాణలో 417 కరోనా కేసులు

78

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,88,410 చేరుకోగా, కరోనా బారిన పడి ఇప్పటికీ 1,556 మృతి చెందారు.రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో 4,982 యాక్టివ్ కేసులుండగా.. ట్రీట్ మెంట్ అనంతరం 2,81,872 డిశ్చార్జి అయ్యారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 82 పాజిటివ్ కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.