నగరాన్ని స్తంభింపజేసిన రెండు ఘటనలు

by  |
నగరాన్ని స్తంభింపజేసిన రెండు ఘటనలు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: పదిమంది గొప్పగా చెప్పుకునే మహానగరం హైదరాబాద్. ఇలాంటి నగరాన్ని రెండు ఘటనలు చిన్నా భిన్నం చేశాయి. అందులో ఒకటి కరోనా.. మరోకటి భారీవర్షాలు. ఈ ఘటనలతో నగరంలోని ప్రజల బ్రతుకులు ఛిద్రమైనాయి. 2020 మార్చి 22 నుంచి ఆగస్టు 25 వరకు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లౌక్ డౌన్ విధించారు. దీంతో హైదరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ,ప్రైవేటు సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఒక్క మాటలో చెప్పలంటే నగరం స్తంభించింది.పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు. అడుగు బయట పెట్టలే. లక్షలాది మందిని తన కడుపులో దాచుకున్న భాగ్యనగరంలో ఒక్క పూట భోజనం కూడా కరువైన పరిస్థితికి వచ్చింది. లక్షలాది మంది వలస జీవులు తమ గ్రామాలకు వెళ్లారు. లాక్ డౌన్ ఎత్తి వేసిన కొద్ది రోజుల్లో వర్షాలు ఆగమాగం చేశాయి. 2020 మొత్తం కరోనా.. వరదలతోనే సవాసం చేయాల్సి వచ్చింది. ఈ ఏడాదైనా సంతో షంగా ఉండాలంటూ సగటు జీవులు ఆకాంక్షిస్తున్నారు.

వరదల సమయంలో..

సుమారుగా నెల రోజుల పాటు నగరంలోని వందలాది కాలనీల, బస్తీలల్లోని జనాలు నరకం అనుభవించారు. వరద ప్రవాహానికి చిన్న చిన్న ఇళ్లు, కార్లు, ట్రాలీలు, ఆటోలు, టూవీలర్లు, తోపుడుబండ్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. చెరువులు, నాలాలు పొంగి పొర్లుతుండటం, మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనిలన్నీ నీట మునిగాయి. వర్షానికి నగరంలోని ఇళ్లలలోకి వరద నీరు చేరి ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల నష్టం జరిగిందని అంచనా వేసింది. ప్రతి బాధితుడిని కాపాడుకుంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ పేద, మధ్య తరగతి కుటుంబాలు సహాయం అందక ఇబ్బందులు పడ్డారు.

అప్పటి డ్రైనేజీ వ్యవస్థయే నేటీకి..

హైదరాబాద్ నగరానికి 1908 సంవత్సరంలో భారీ వరదలు వచ్చినప్పుడు నగరం మునిగిపోయింది. ఆ సమయంలో నిజాం వరదలను నివారించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్యను కోరారు. దాంతో మూసితో పాటు ఈసీ నదిపై కొన్ని జలాశయాలను నిర్మించాలని విశ్వేశ్వరయ్య ఓ ప్రణాళికను ప్రతిపాదించి, నిర్మించినట్లు ఇంజినీరింగ్ నిపుణులు వివరిస్తున్నారు.అప్పడు నిర్మించిన డ్రైనేజీని మరమ్మతులు చేస్తూ నేటీకి ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ లో ఒకప్పుడు 2000 చెరువులు ఉండేవని నేడు 200 కూడా కనిపించటం లేదు. చెరువులను, బావులను పూడ్చి చేపడుతున్న నిర్మాణాలు చేపట్టడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం అవుతున్నాయి.


Next Story