కరోనా.. రోజురోజుకు తగ్గుముఖం

10

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం కొత్తగా 4,622 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,63,573కు చేరుకున్నాయి. ఇందులో 42,855 యాక్టివ్ కేసులు ఉండగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,14,427 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజాగా 35 మంది వైరస్ బారిన పడి మృతి చెందగా, ఈ మొత్తం సంఖ్య 6,291కు చేరింది. కాగా, గడచిన 24గంటల్లో ఏపీలో 72,082 టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.