- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ మంత్రి దంపతులకు కరోనా పాజిటివ్
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ విజృంభిస్తోంది. సామాన్యులకే కాకుండా ప్రముఖులకూ కరోనా సోకుతూ… విస్తరిస్తోంది. తాజాగా ఒడిశా స్కూల్ అండ్ మాస్ ఎడ్యూకేషన్ మినిస్టర్ సమీర్ రంజన్ దాస్, ఆయన భార్య సంగీతా దాస్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రే వెల్లడించారు. ఒడిశాలో ఇప్పటివరకూ ఏడుగురు మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు కరోనా బారిన […]</p>

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ విజృంభిస్తోంది. సామాన్యులకే కాకుండా ప్రముఖులకూ కరోనా సోకుతూ… విస్తరిస్తోంది. తాజాగా ఒడిశా స్కూల్ అండ్ మాస్ ఎడ్యూకేషన్ మినిస్టర్ సమీర్ రంజన్ దాస్, ఆయన భార్య సంగీతా దాస్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రే వెల్లడించారు. ఒడిశాలో ఇప్పటివరకూ ఏడుగురు మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు కరోనా బారిన పడ్డారు.
మంత్రి దంపతులకు కరోనా సోకిన విషయం తెలిసిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సమీర్ మోహంతీ స్పందిస్తూ… తాను కూడా కరోనా వైరస్ బారిన పడినట్టు పడ్డానని, వైద్యుల సలహా మేరకు భువనేశ్వర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కాగా ఇప్పటికే బీజేపీ లోక్‌సభ ఎంపీ సురేశ్ పూజారి, ఎమ్మెల్యే సుకంతా కుమార్ నాయక్‌లకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో గతవారం రోజుల నుంచి తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని మంత్రి సూచించారు.
Read Also…






