- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో కరోనా కలకలం.. ఆందోళనలో తల్లిదండ్రులు
<p>దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు. మహమ్మారి ప్రభావం తగ్గిందని అంతా భావించారు. కానీ విద్యాసంస్థలు మొదలవడంతో భారీగా పిల్లలకు సోకుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని శ్రీచైతన్య విద్యాసంస్థల్లో కొందరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమయిన యాజమాన్యం స్కూల్ లో ఉన్న 480 మందికి టెస్టులు చేయించారు. ఇందులో దాదాపు 60 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యిందని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ తెలిపారు. అయితే, […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు. మహమ్మారి ప్రభావం తగ్గిందని అంతా భావించారు. కానీ విద్యాసంస్థలు మొదలవడంతో భారీగా పిల్లలకు సోకుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని శ్రీచైతన్య విద్యాసంస్థల్లో కొందరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమయిన యాజమాన్యం స్కూల్ లో ఉన్న 480 మందికి టెస్టులు చేయించారు. ఇందులో దాదాపు 60 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యిందని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ తెలిపారు. అయితే, ఇందులో ఇద్దరిలోనే లక్షణాలు(Covid symptoms) ఉన్నాయని, భయపడాల్సిందేమీ లేదని చెప్పారు. వైరస్ సోకిన విద్యార్థుల్లో 46 మంది కర్ణాటక వాసులు కాగా.. మిగిలిన 14 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. దీంతో విద్యాసంస్థను అక్టోబర్ 20 వరకు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
Next Story






