- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్‌లో భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు జలాభిషేకాలు..
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్, కోటార్మూర్‌లలో, మండలంలోని గోవింద్ పెట్, అంకాపూర్, ఇస్సాపల్లి, ఫతేపూర్, సుర్బిర్యాల్, చేపూర్ తదితర గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ, సర్వ సమాజ్ ల ఆధ్వర్యంలో గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు.

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్, కోటార్మూర్‌లలో, మండలంలోని గోవింద్ పెట్, అంకాపూర్, ఇస్సాపల్లి, ఫతేపూర్, సుర్బిర్యాల్, చేపూర్ తదితర గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ, సర్వ సమాజ్ ల ఆధ్వర్యంలో గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు. పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాలతో, అలవాట్లతో పవిత్ర గంగా నది జలాలను తీసుకొచ్చి డప్పుల చప్పుళ్ళ మధ్య వల గొడుగులతో కులవృత్తుల సభ్యుల సాంప్రదాయ పూజల మధ్య అత్యంత ఆధ్యాత్మికంగా గ్రామ దేవతలకు గంగా జలాలతో అభిషేకాలు జరిపించారు.
సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, పాడి పంటలు అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామదేవతల అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుల సంఘాల వారీగా కుల సంఘాల ప్రతినిధులు సల్లంగా చూడండి తల్లులు అంటూ మేకలను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు చేశారు. ఆషాడ మాసం ప్రారంభమవడంతో శివార్లలో పచ్చిక బయల్ల మధ్య ప్రజలందరి వనభోజనాలతో సందడి నెలకొంది. అన్ని గ్రామాల్లో సర్వ సమాజ్, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో వారి పరిధిలోని కుల సంఘాల ప్రతినిధుల ప్రోద్బలంతో గ్రామదేవతలకు నిర్వహించిన జలాభిషేకం కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.






