విత్తన మేళా – 2026ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

by Kodari Anjali |

విత్తన మేళా – 2026 కార్యక్రమాన్నిముత్యాలంపాడు క్రాస్ రోడ్డు రైతు వేదిక నందు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు సోమవారం ఘనంగా ప్రారంభించారు.

విత్తన మేళా – 2026ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
X

దిశ, టేకులపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న "విత్తన మేళా – 2026 కార్యక్రమాన్నిముత్యాలంపాడు క్రాస్ రోడ్డు రైతు వేదిక నందు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి విత్తన మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే , ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల విత్తనాల స్టాళ్లను పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎల్-నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి విత్తన మేళాలను నిర్వహిస్తోందన్నారు.రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ, తమ ప్రాంతానికి అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో డి ఏ ఓ బాబురావు , ఏ డి ఏ లాల్ చంద్ , ఏఓ అన్నపూర్ణ ,ఏఈవో లు, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు సర్పంచ్ బానోత్ పూల బంతి , తదితరులు పాల్గొన్నారు.

Next Story