- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు, రేపు నల్లమలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల ప్రాంతంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

దిశ, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల ప్రాంతంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు, రేపు అధికారికంగా పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.
పర్యటన షెడ్యూల్:
సోమవారం (జూలై 27): మధ్యాహ్నం అనంతరం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు అమ్రాబాద్ మండలం శ్రీశైలం సమీపంలోని బ్రహ్మగిరిలో పల్లె దవాఖానను ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 7:00 గంటలకు శ్రీశైలం చేరుకుని రాత్రి బస చేస్తారు.
మంగళవారం (జూలై 28): ఉదయం 6:30 నుంచి 8:00 గంటల వరకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని వీఐపీ దర్శనం చేసుకుంటారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు అమ్రాబాద్ మండలం మన్ననూరులో రూ.9.30 కోట్లతో పీటీజీ గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:30 గంటలకు అమ్రాబాద్ మార్కెట్ యార్డులో రూ.1 కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11:30 గంటలకు పదర మండల కేంద్రంలో రూ.60 లక్షలతో నిర్మించనున్న ఆహార ధాన్యాల నిల్వ గోదాం భవనాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.






