‘క్రషర్ ఏర్పాటును నిలిపి వేయాలి’.. కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా

by Jakkula.Mamatha |

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పహిల్వాన్ పురం గ్రామంలో క్రషర్ మిల్లు ఏర్పాటు నిలిపివేయాలని గ్రామ రైతులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

‘క్రషర్ ఏర్పాటును నిలిపి వేయాలి’.. కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పహిల్వాన్ పురం గ్రామంలో క్రషర్ మిల్లు ఏర్పాటు నిలిపివేయాలని గ్రామ రైతులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. పహిల్వాన్‌పూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 271, 275, 282, 268, 269, 270లలోని సుమారు 70 ఎకరాల జాయింట్ పట్టా భూమి ఉంది. ఈ భూమిలో భాగమైన ఎ.4.20 గుంటల భూ యజమాని ఎలిమినేటి నారాయణరెడ్డి.. శ్రీ గాయత్రి మెటల్ ఇండస్ట్రీస్ యజమాని విక్రమ రెడ్డికి లీజుకు ఇచ్చారన్నారు.

లీజు భూమిలో క్రషర్ మిల్లును ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో క్రషర్ మిల్లు వెలిస్తే పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లు నుంచి వెలువడే దుమ్ము, ధూళి వల్ల చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాల పంట పొలాలు పాడైపోతాయని, పశువులతో పాటు గ్రామంలోని ప్రజల ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుందని వారు వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎలిమినేటి జంగా రెడ్డి, వెంకట్ రెడ్డి,రమేష్, అంజమ్మ, జలంధర్ రెడ్డి, సత్తి రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story