Raghu Kunche: ఒకరి వల్ల పూరి జగన్నాథ్ మోసపోయాడు.. దాంతో నెలకు అన్ని లక్షలు వడ్డీ కట్టాడు

by Pulgam srinivas |

ఒక వ్యక్తి చేసిన మోసం కారణంగా పూరి జగన్నాథ్ భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొని, నెలకు రూ.50 లక్షల వరకు వడ్డీ చెల్లించాల్సి వచ్చిందని రఘు కుంచె వెల్లడించారు.

Raghu Kunche: ఒకరి వల్ల పూరి జగన్నాథ్ మోసపోయాడు.. దాంతో నెలకు అన్ని లక్షలు వడ్డీ కట్టాడు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్‌తో ఆయనకు ఎంతో సన్నిహితమైన స్నేహం ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు రఘు కుంచె సంగీతం కూడా అందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, పూరి జగన్నాథ్ జీవితంలో జరిగిన ఓ మోసం గురించి, దాని వల్ల ఆయన ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి వెల్లడించారు. రఘు కుంచె మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్, నేను చాలా మంచి స్నేహితులం. ఆయనతో ఏ విషయమైనా ఓపెన్‌గా మాట్లాడే చనువు నాకు ఉంది. పూరి ఒక వ్యక్తిని ఎంతో నమ్మాడు.

కానీ ఆ వ్యక్తి ఆయనను భారీ స్థాయిలో మోసం చేశాడు. దాంతో పూరి జగన్నాథ్‌కు పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆయన భారీగా అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. 'ఏక్ నిరంజన్', 'బంపర్ ఆఫర్' సినిమాల సమయంలో ఆ అప్పులపై నెలకు రూ.50 లక్షల వరకు వడ్డీ చెల్లించేవాడు. అదే సమయంలో ఎంతో ఇష్టంగా, ఎంతో ఖర్చు చేసి ఒక అద్భుతమైన ఆఫీస్‌ను నిర్మించుకున్నాడు. అయితే అప్పులు తీర్చలేక చివరికి ఆ ఆఫీస్‌ను అమ్మేయాల్సి వచ్చింది. అనంతరం అద్దె ఆఫీస్‌లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వ్యక్తి చేసిన మోసం వల్ల పూరి జగన్నాథ్ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయిని రఘు కుంచె తెలిపారు.

Next Story