- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనమ్ వాంగ్‌చుక్.. రాజ్‌ఘాట్ సందర్శన
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న మేదాంత ఆసుపత్రి నుంచి సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న మేదాంత ఆసుపత్రి (Madanta Hospital) నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 26 రోజుల పాటు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష అనంతరం కోలుకున్న ఆయన, వీడియో సందేశం ద్వారా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజు రానే వచ్చిందని, ప్రస్తుతం తన ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని తెలిపారు. కొద్దికొద్దిగా ఆహారం తీసుకుంటూ శరీరంలో శక్తిని పుంజుకుంటున్నానని, ఈ ఉద్యమంలో తమకు మద్దతుగా నిలిచి గళమెత్తిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఆసుపత్రి నుంచి బయలుదేరి లడఖ్‌లోని తన స్వగ్రామానికి వెళ్లే ముందు ఢిల్లీలోని రాజ్‌ఘాట్ (Rajghat)ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించనున్నట్లు వాంగ్‌చుక్ వెల్లడించారు. న్యాయం కోసం సుదీర్ఘంగా సాగించిన తమ పోరాటం చివరికి విజయం సాధించిందని, అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. అనంతరం ఆయన వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ తిరిగి కొండ ప్రాంతాలకు బయలుదేరనున్నట్లు తెలిపారు.






