- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసారి.. సరీ లేదు
<p>దిశ, ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో అదివారం జరిగిన ఉరపండగపై కరోనా ఎపెక్ట్ పడింది. వేలామంది సాక్షిగా ఉజ్జయిని మహంకాళీ ఉత్సవాల ప్రారంభం రోజు అంగరంగ వైభవంగా జరిగే ఉర పండుగ( పెద్ద పండుగ) ఇండ్లకే పరిమితం అయింది. ఈసారి బండారు పోయకపోయినా.. నగర నలుమూలలకు అవసరమైన ( 9) గ్రామాదేవతల విగ్రహాలను చెక్కారు. సర్వసమాజ్ ఆధ్వర్యంలో అదివారం తెల్లవారు జాము వరకే నగరంలోని ఖిల్లా నుంచి నలుదిక్కులకు విగ్రహాలను గ్రామసేవకులు తరలించేశారు. తెల్లవారే సరికి అన్ని […]</p>

దిశ, ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో అదివారం జరిగిన ఉరపండగపై కరోనా ఎపెక్ట్ పడింది. వేలామంది సాక్షిగా ఉజ్జయిని మహంకాళీ ఉత్సవాల ప్రారంభం రోజు అంగరంగ వైభవంగా జరిగే ఉర పండుగ( పెద్ద పండుగ) ఇండ్లకే పరిమితం అయింది. ఈసారి బండారు పోయకపోయినా.. నగర నలుమూలలకు అవసరమైన ( 9) గ్రామాదేవతల విగ్రహాలను చెక్కారు. సర్వసమాజ్ ఆధ్వర్యంలో అదివారం తెల్లవారు జాము వరకే నగరంలోని ఖిల్లా నుంచి నలుదిక్కులకు విగ్రహాలను గ్రామసేవకులు తరలించేశారు. తెల్లవారే సరికి అన్ని ప్రాంతాలలో తొమ్మిది విగ్రహాలను ప్రతిష్టించారు. నగర ప్రజలు ఈసారి రోడ్డుకు ఎదురొచ్చి మొక్కులను తీర్చుకున్నారు. ఈ సారి ‘సరీ’చల్లడం లేకుండా భారిగా ఉరేగింపు లేకుండానే ఉరపండగా గంట వ్యవధిలో జరిపించేశారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈసారి పండగ వాతవారణం మాయం అయిపోయింది. ఎక్కడ నగరంలో దేవతల విగ్రహాల ప్రతిష్టపన జరిగిన చోట కొందరు మాత్రమే తమ మొక్కులను తీర్చుకున్నారు. పోలిస్ ల బందోబస్తు అవసరం లేకుండా పండగ జరిగిపోయింది.






