నితిన్ పెళ్లికి కరోనా కష్టాలు

by  |
నితిన్ పెళ్లికి కరోనా కష్టాలు
X

దిశ, వెబ్‌డెస్క్:

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ముఖ్యమైన వేడుకలు, సదస్సులు అన్నీ వాయిదా పడుతున్నాయి. పాపం హీరో నితిన్‌ని కూడా ఆ కరోనా కష్టం తప్పలేదు. అవును.. ఏప్రిల్ 16న నితిన్, షాలిని రెడ్డిల పెళ్లి వేడుక దుబాయ్‌లో హోటల్ పలాజోలో జరగనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా దుబాయ్‌లో రాకపోకలు నిలిపి వేయడంతో నితిన్ పెళ్లికి అడ్డంకిగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శ్రీనివాస కల్యాణం సినిమాలో అందర్నీ పిలిచి ఐదు రోజులు పెళ్లి చేసుకోవాలని ప్రేక్షకులకు హితబోధ చేసి, తాను మాత్రం దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడమేంటని కొందరు తమాషాగా అన్నప్పటికీ ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే దుబాయ్‌లో కుదరకపోతే హైదరాబాద్‌లోని ఫాం హౌజ్‌లో వివాహం జరిపేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

tags: Nitin, Marriage, Shalini Reddy, Corona, Virus, Dubai


Next Story