కరోనా.. నీకగ్గిదల్గ, ఎంత నర్వస్ జేస్తున్నవే!

by Chukka Sudharani |   (  Updated:2020-03-05 08:29:20  IST  )

<p>దిశ, న్యూస్‌బ్యూరో: సిటీలోని చింతల్‌‌వాసులు గోపాల్‌రెడ్డి, భారతి దంపతులది ఇవాళ పెళ్లిరోజు. ఈసారి వారి వెడ్డింగ్ యానివర్సరీకి స్పెషాలిటీ ఉన్నది. ఆ ఆలుమగల బంధానికి 25 వసంతాలు. ఈ స్వీట్ మెమొరీని వారం ముందే గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు దగ్గరి వాళ్లందరికీ ఇన్విటేషన్ పంపారు. తీరా సమయానికి సమీపంలోని కొంపల్లిలో ఒక లేడీ కరోనా లక్షణాలతో సఫర్ అవుతున్నారని వాళ్ల చెవిన పడింది. శుభమా అంటూ ఎంతో ఉత్సాహంతో తలపెట్టిన వేడుకలకు వచ్చే [&hellip;]</p>

కరోనా.. నీకగ్గిదల్గ, ఎంత నర్వస్ జేస్తున్నవే!
X

దిశ, న్యూస్‌బ్యూరో:
సిటీలోని చింతల్‌‌వాసులు గోపాల్‌రెడ్డి, భారతి దంపతులది ఇవాళ పెళ్లిరోజు. ఈసారి వారి వెడ్డింగ్ యానివర్సరీకి స్పెషాలిటీ ఉన్నది. ఆ ఆలుమగల బంధానికి 25 వసంతాలు. ఈ స్వీట్ మెమొరీని వారం ముందే గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు దగ్గరి వాళ్లందరికీ ఇన్విటేషన్ పంపారు. తీరా సమయానికి సమీపంలోని కొంపల్లిలో ఒక లేడీ కరోనా లక్షణాలతో సఫర్ అవుతున్నారని వాళ్ల చెవిన పడింది. శుభమా అంటూ ఎంతో ఉత్సాహంతో తలపెట్టిన వేడుకలకు వచ్చే గెస్టుల్లో ఎవరికీ ఇబ్బంది కలగకూడదని సున్నితంగా ఆలోచించారు. తమ వివాహ వార్షికోత్సవ సంబురాలనే రద్దు చేసుకున్నారు.

భాగ్యనగరిలోని ఓ వీధిలో ‘పరిమళభరిత’ కుటుంబం. ఆ ఫ్యామిలీలో కరోనా సింటమ్స్‌తో బాధితురాలు ఇంటిపట్టునే ఫుల్ కేర్‌ తీసుకుంటున్నారట. ఆ ఇంటిగది విండో తెరిచి ఉంటున్నది. ఆ భయంతో సమీప గృహస్తులు ఉన్నపళంగా మరెక్కడికైనా టెంపరరీ షిఫ్ట్‌కు రెడీ అవుతున్నారు. కరోనా వైరస్‌ను ఎక్కడి నుంచో మోసుకొచ్చిన సికింద్రాబాద్ మహేంద్రా‌హిల్స్ యువకుడికి గాంధీ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. అతడి కుటుంబీకులకు చేసిన టెస్టుల్లో నెగెటివ్ రిజల్టు రావడంతో నిన్న ఇల్లు చేరారు. 14 రోజులదాకా వైరస్ ఉనికి తెలియదనీ, కాబట్టి అప్పటిదాకా ఇంటికి రావొద్దంటూ స్థానికులు ఆంక్షలు విధించారు. తమ సొంతింట్లోకి వెళ్లేందుకే ఆ ఫ్యామిలీ సరికొత్త పరీక్షను చవిచూస్తోంది. ఓ వైపు పేషెంట్ వద్ద ఉండలేక, మరోవంక సొంత గూడు చేరలేక కరోనా వైరస్ కారణంగా ఎంతో నర్వస్ అవుతున్నారు. ఆ కాలనీలో వాకింగ్ వంటి దైనందిన కదలికలు, యాక్టివిటీస్‌ను జనం ఆపేశారు. సమీప ఏరియాల్లోని స్కూళ్లు సెలవులు ప్రకటించాయి.

ఉద్యోగినికి అస్వస్థత వల్ల ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏకంగా ఎంప్లాయీస్‌ను ఇళ్లకు పంపించేసిన సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు ఇస్తున్నాయట. విమాన ప్రయాణాలూ తగ్గాయి. ఆ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రయ్ రయ్‌మని రాకపోకలు చేసే క్యాబులూ డల్లయ్యయి. ట్రాఫిక్కూ పల్చబడుతున్నది. సీఏఏకు సపోర్టుగా హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ఈ నెల 15న నిర్వహించాలనుకున్న అమిత్ షా బహిరంగ సభను బీజేపీ పోస్ట్‌పోన్ చేసింది. సినిమా ఆటల అంశంలో చిత్ర పరిశ్రమ పెద్దలూ సమాలోచనల్లో పడ్డారు. హోటళ్ల గిరాకీ తగ్గింది. అదే టైంలో సూపర్ మార్కెట్లలో హ్యాండ్ వాష్, శానిటైజర్ల సేల్సు ఓ రేంజ్‌లోనే ఉన్నాయి. ఇదే చాన్సంటూ కొన్నిచోట్ల ‘బై వన్ గెట్ వన్ ఫ్రీ’ మార్కెటింగ్ ట్రిక్కులు ఊపందుకున్నాయి. మెడికల్ షాపుల్లో మాస్కుల కథ చూస్తున్నదేనాయే. కొవిడ్-19 సకల మానవాళినీ, సమస్త రంగాలనూ ఎంతలా ప్రభావితం చేస్తున్నదో గ్రహించడానికి మచ్చుకు ఇవి చాలవా?

జనం బేజారు.. జాగ్రత్తల జోరు

కరోనా గురించి వింటూ, చూస్తూ జనం బేజారవుతున్నారు. ఎవరికి వారు కనీస జాగ్రత్తలు పాటిస్తున్నారు. అట్లే సంస్థల పరంగానూ మార్గదర్శకాలు జారీ అవుతున్నాయి. కరోనా పీడితులు తాకిన వాటిని ముట్టుకునే వాళ్లకూ అంటే చాన్సు అధికంగా ఉంది. దాంతో బయోమెట్రిక్ అటెండెన్సుపై అలర్ట్ చేస్తున్నారు. న్యూఢిల్లీలోని జేఎన్‌యూ ఆ విధానాన్ని తాత్కాలికంగా పక్కన బెట్టింది. మాన్యువల్‌కు గైడ్ చేసింది. తదుపరి ఉత్తర్వు ఇచ్చేదాకా పాత పద్ధతి అమల్లో ఉంటుందని నిన్న తేల్చిచెప్పింది. విద్యార్థులకు ఎగ్జామ్స్ అంటేనే సవాలక్ష రూల్సు. అమ్మాయిల చెవి దిద్దుల తనిఖీలూ చూశాం. అలాంటిది కోవిడ్ కల్లోలం నేపథ్యంలో ఫేస్ మాస్కులకు సీబీఎస్ఈ పర్మిట్ చేసింది. అండర్ ట్రయల్ ఖైదీలను విచారణకు కోర్టుకు తేవద్దనీ జైళ్ల శాఖకు మన హైకోర్టు సూచించింది. విద్యా సంస్థలు, వృద్ధ, అనాథాశ్రమాలు వంటి చోట్ల తగిన ఏర్పాట్లకు ఆదేశించింది. ఇట్లా ఆయా సెక్టార్లలో ప్రికాశన్స్ స్పీడయ్యాయి.

టానిక్కా.. ప్యానిక్కా!

కరోనాపై జనంలో ప్యానిక్ క్రియేట్ చేయొద్దని పాలకులు, హయ్యర్ ఆఫీసర్లూ మీడియా తదితరాలకు సుద్దులు చెబుతున్నారు. మంచిదే. పబ్లిక్‌ను భయకంపితులను చేయడం ఎవరికైనా తగదు. అదే సమయంలో ప్రభుత్వాలు, వాటి పెద్దల తీరూ అదే ‘లైన్’‌లో ఉంటే బెటరే. బడులు మొదలు బడా ఆర్గనైజేషన్ల దాకా అవగాహన సదస్సులకు పురమాయిస్తున్నారు. ఆ సందేశాలు స్కూళ్లలోని బుజ్జాయిల పసి మనసులను కంగారు పెట్టించవా? అనే సందేహం నీడలా వెంబడిస్తున్నది. హైదరాబాద్ తొలి కేసునూ ఉటంకిస్తూ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ హడావుడిగా రియాక్టయ్యారు. అంతేనా ఢిల్లీ బాసులుసహా అనేక మంది నేతలు ఈ నెల 9న ఉండే హోలీ సంబరాలకు దూరమని సెలవిచ్చారు. ఇలాంటివన్నీ వారి దృష్టిలో జనానికి తగిన ఉపశమనపు టానిక్‌లానే కావొచ్చు. హబ్బో అంతటోళ్లే ఇంతలా చెబుతున్నారు, మనమెంత? అనే ప్యానిక్ ఇండికేషన్స్ సాధారణ పబ్లిక్‌లోకి విపరీతంగా వదిలినట్టు కాదా? అన్నది మరో యాంగిల్! ఇందుకు తగ్గట్టుగానే కాబోలు.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఓ కామెంట్ చేశారు. ఢిల్లీ అల్లర్లను మరుగుపరిచేందుకే కరోనాపై భయాందోళనల మోతాదు మించిందని దీదీ వ్యాఖ్యానించడం ఇక్కడ ప్రస్తావనార్హం. జాగ్రత్తలు చెప్పడం, తగు చర్యలు చేపట్టడం ప్రభుత్వాలు, వ్యవస్థల బాధ్యత. సూచనలను అనుసరించడం మనందరి కర్తవ్యం. నో డౌట్, నో డిస్పూట్! నిజానికి ఎన్నో రకాల వైరస్‌లను మనమంతా ఎదుర్కొంటూ అధిగమిస్తూనే ఉంటాం. సీజనల్ ఫ్లూ, మిజిల్స్, ఎబోలా, చికున్ గున్యా వంటి వైరస్‌లు నిరంతరం వెంటాడతాయి. కానీ, కరోనా అలియాస్ కోవిడ్-19పై ఇంతలా హైరానా అండ్ టాంటాం ఎందుకంటే, ప్రమాదకారి అయిన అది వేగంగా, ఈజీగా సోకుతుంది కాబట్టి! అయితే మరణాల రేటు తక్కువే! చైనాలో 80 వేల మందికి ఆ వైరస్ ప్రబలగా, చనిపోయింది మాత్రం 3 వేల మందేనట. మన దేశంలో కరోనా కేసులు నమోదయ్యాయే కానీ, ఎవరూ మృతి చెందలేదు! కేరళ మాదిరి పర్‌ఫెక్ట్ ప్రణాళికైతే అవసరం, అనివార్యం. ఆ రాష్ట్రంలో మొన్నా మధ్య నిఫా వైరస్‌కు గట్టిగా కళ్లెం వేయగలిగారు. అక్కడ పబ్లిక్ హెల్త్ ప్లస్ యంత్రాంగం అంతలా నిబద్ధత, సమర్థతతో ఉంది మరి! మనమైతే అన్నివిధాలా అప్రమత్తంగా ఉందాం! నో కాంప్రమైజ్. అందరినీ, అన్నింటినీ సుడి‘గండం’లోకి నెడుతోన్న కరోనా అనబడే అత్యంత సూక్ష్మ‌క్రిములకు అగ్గి తగలాలి. అదే ఎండలు బాగా ముదిరితే, అది తోక ముడుస్తుందట!

Next Story