- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజురాబాద్ ప్రజలకు షాకిస్తున్న కరోనా.. రైతు మృతి
<p>దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం బై ఎలక్షన్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో మాజీమంత్రి ఈటల రాజేందర్ ప్రజాదీవెన పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆ ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు, పలువురు నేతలు రోజు గుంపులుగుంపులుగా సంచరిస్తున్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్‌లో కరోనా మరణం నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, నియోజకవర్గంలోని కాట్రపల్లి గ్రామంలో ఓ రైతు కరోనాతో మృతి చెందినట్లు గ్రామస్తులు […]</p>

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం బై ఎలక్షన్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో మాజీమంత్రి ఈటల రాజేందర్ ప్రజాదీవెన పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆ ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు, పలువురు నేతలు రోజు గుంపులుగుంపులుగా సంచరిస్తున్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్‌లో కరోనా మరణం నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అయితే, నియోజకవర్గంలోని కాట్రపల్లి గ్రామంలో ఓ రైతు కరోనాతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల ఆయన ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడే కరోనా సోకినట్లు తెలుస్తుండగా.. వెంటనే ఆ రైతును హనుమకొండ, కరీంనగర్‌లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఆదివారం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వారు తెలిపారు. కాగా మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె కలరు.






