కరోనా క్రైసిస్ చారిటీకి వెల్లువెత్తిన విరాళాలు

by  |
కరోనా క్రైసిస్ చారిటీకి వెల్లువెత్తిన విరాళాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకొచ్చింది. కరోనా క్రైసిస్ చారిటీని ఏర్పాటు చేసి తమ వంతు సహాయాన్ని అందిస్తోంది. నిరుపేద కళాకారులకు మూడు పూటలా తిండి అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇండస్ట్రీ పెద్ద దిక్కు చిరు, నాగ్, దగ్గుబాటి ఫ్యామిలీ రూ. కోటి రూపాయల చొప్పున సహాయం అందించగా… మిగిలిన హీరోలు లక్షల్లో విరాళాలు ఇచ్చారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కటౌట్‌కు తగినట్లుగానే ఇప్పటికే రూ. 4 కోట్ల విరాళం అందించాడు. పీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 3 కోట్లు అందించిన డార్లింగ్…. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తాజాగా తెలుగు సినీ కళాకారులను ఆదుకునేందుకు గాను మరో రూ. 50 లక్షలు అందించారు. తన సహాయం సీసీసీకి అందుతుందని తెలిపారు. దీంతో మొత్తంగా నాలుగున్నర కోట్ల విరాళం ఇచ్చిన ప్రభాస్ నిజమైన ‘బాహుబలి’ అనిపించుకున్నాడు.

ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 1. 25 కోట్ల విరాళాన్ని అందించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… సినిమా కోసం కష్టపడే కార్మికులకు సహాయాన్ని అందించేందుకు మరోసారి ముందుకొచ్చాడు. కరోనా క్రైసిస్ చారిటీకి రూ. 20లక్షల విరాళాన్ని ప్రకటించాడు. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ రూ. 10 లక్షలు అందించగా… వెన్నెల కిశోర్ రూ. 2 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ. లక్ష విరాళాన్ని ప్రకటించారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ కూడా తన వంతు సహాయాన్ని ప్రకటించింది. కరోనా కారణంగా షూటింగ్‌లు వాయిదా పడి పొట్టకూటి కోసం బాధపడుతున్న పేద సినీ కళాకారులను ఆదుకునేందుకు గాను రూ. 10 లక్షలు అందిస్తున్నట్లు తెలిపింది. ప్రముఖ నిర్మాత (సౌభాగ్య థియేటర్స్ జంగారెడ్డిగూడెం) కరాటం రాంబాబు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం’ కు లక్ష రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు.

నటుడు బ్రహ్మాజీతో పాటు తనయుడు సంజీవ్ (పిట్టకథ ఫేం) తెలుగు సినీ కళాకారుల కన్నీటిని తుడిచేందుకు ముందుకొచ్చారు. బ్రహ్మాజీ రూ. 75, 000, సంజీవ్ రూ. 25, 000 ఇస్తున్నట్లు ప్రకటించారు.

నిరుపేద కళాకారులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన సినీ ప్రముఖులకు దన్యవాదాలు తెలిపారు కరోనా క్రైసిస్ చారిటీ అధ్యక్షులు చిరంజీవి. మీ మద్ధతు సినీ వర్కర్లకు చాలా పెద్ద సహాయం అని… కరోనా కట్టడికి చేసే పోరులో భాగస్వాములు అవుదామని… మరింత మంది సహాయం చేసేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Tags : TFI, CCC, CoronaVirus, Covid 19



Next Story

Most Viewed