- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో కరోనా డీలా?
<p>న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కరోనా కేసులతో అట్టుడికిపోయింది. జూన్ నెలలో కరోనా హాట్‌స్పాట్ ముంబయినే బీట్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న నగరాల జాబితాలోకి వెళ్లింది. కేవలం నెల వ్యవధిలోనే 66,526 కేసులు నమోదయ్యాయి. నిపుణులు, ప్రభుత్వాధినేతలూ చేతులెత్తేసిన వైనం. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానైతే జూలై చివరికల్లా ఇక్కడ 5.5 లక్షల కేసులు రిపోర్ట్ అవుతాయని, జూన్ చివరి వరకు లక్ష దాటుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యారోగ్య సిబ్బంది, మౌలిక వసతులతో […]</p>

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కరోనా కేసులతో అట్టుడికిపోయింది. జూన్ నెలలో కరోనా హాట్‌స్పాట్ ముంబయినే బీట్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న నగరాల జాబితాలోకి వెళ్లింది. కేవలం నెల వ్యవధిలోనే 66,526 కేసులు నమోదయ్యాయి. నిపుణులు, ప్రభుత్వాధినేతలూ చేతులెత్తేసిన వైనం. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానైతే జూలై చివరికల్లా ఇక్కడ 5.5 లక్షల కేసులు రిపోర్ట్ అవుతాయని, జూన్ చివరి వరకు లక్ష దాటుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యారోగ్య సిబ్బంది, మౌలిక వసతులతో అధినేతల కంటిపై కునుకులేకుండా పోయింది. కానీ, నేడు పరిస్థితులు మారిపోతున్నట్టు కనిపిస్తున్నాయి.
ఢిల్లీ కేసుల్లో ఊరట:
గతనెల 23న సుమారు నాలుగువేల కేసులు(3,906) నమోదైన ఢిల్లీలో తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. వారం రోజులుగా కొత్త కేసులు మూడువేల లోపే రిపోర్ట్ అవుతున్నాయి. గతనెల 27వ తేదీన 2,948 కేసులుండగా తర్వాత వరుసగా 2,889- 2,084- 2,199ల కేసులు నమోదయ్యాయి. ఈ నెలలోనైతే 1వ తేదీన 2,442 తర్వాతి రోజున 2,373, 3వ తేదీన 2,520 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మే 1న తొలి కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ తర్వాతి 41 రోజుల్లో వెయ్యి మార్కును దాటగా, మరో తొమ్మిది రోజుల్లో 10వేలను క్రాస్ చేసింది. జూన్ 1న 20,834 కేసులున్నాయి. మొత్తం కేసుల్లోనూ మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో కొనసాగిన ఢిల్లీ నేడు మూడో స్థానానికి చేరింది. కొత్త కేసుల్లో జాతీయ సగటు కన్నా తక్కువే ఉన్నది.
కేసుల పెరుగుదలకు టెస్టులు కారణమా?
కరోనా కేసుల బులెటిన్‌లో ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. సర్కారు లెక్కలకు హాస్పిటల్ లెక్కలకు పొంతన లేకపోవడంపై ఆందోళనలు రాగా, కేజ్రీవాల్ సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేసుల సంఖ్య పెరుగుతున్నా టెస్టుల సంఖ్య మాత్రం పెంచడానికి వెనుకాడింది. ఈ విషయంలో సుప్రీంకోర్టూ మొట్టికాయలు వేసింది. టెస్టులు పెంచకపోవడానికి కారణాలేంటో చెప్పాలని మండిపడింది. ఇటీవల కేజ్రీవాల్ చేసిన కామెంట్‌లోనూ ఈ నిజం వెల్లడైంది. గతంలో 100 టెస్టులకు 31 పాజిటివ్‌లు రాగా నేడు 13 వస్తున్నాయని చెప్పారు. అప్పుడు కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్నప్పటికీ కేసులు తగినస్థాయిలో చేపట్టలేదు. తర్వాత టెస్టుల సంఖ్య పెంచడం, అదికూడా అరగంటలో ఫలితాలిచ్చే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేపట్టడంతో కేసులు కుప్పలుతెప్పలుగా పెరిగాయి. దీంతో వాస్తవంగా కరోనా విస్తరణ తీవ్రత ఒక్కసారిగా బయటపడటంతో కేసులు భారీగా నమోదయ్యాయి.
కట్టడికి నడుం కట్టారు:
ఢిల్లీలో కరోనా కట్టడికి కేజ్రీవాల్ సర్కారు, కేంద్రం నడుం కట్టాయి. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆరోగ్య వసతుల సామర్థ్యాన్ని పెంచాయి. గత నెల 30నాటికి 30వేల పడకలు అందుబాటులో ఉంటాయని ఇటీవలే కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. రైల్వే కోచ్‌ల ద్వారా 30వేల బెడ్లు అందుబాటులోకి తెచ్చామని, రాధా స్వామి బియస్ ద్వారా 10వేల బెడ్లు, ఢిల్లీ ప్రభుత్వం అప్పటికే సుమారు 10వేల పడకలు కరోనా పేషెంట్ల కోసం అందుబాటులో ఉంచిందని వివరించారు. అలాగే, కరోనా తీవ్రతను పరిశీలించేందుకు ఇంటికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 6వ తేదీలోపు అది ముగియనుంది. అలాగే, ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తిని గుర్తించడానికి సీరం సర్వే చేపడుతున్నది. అలాగే, కాంటాక్టులను గుర్తించడానికి డోర్ టు డోర్ నిఘా టీం వెళ్లుతున్నది. అంతేకాదు, టీకా కోసం ప్రయత్నాలు జరుగుతుండగానే ఇప్పటికి విజయవంతంగా కనిపిస్తున్న ప్లాస్మా థెరపీ కోసం కేజ్రీవాల్ సర్కారు సిద్ధమైంది. ఏకంగా ప్లాస్మా బ్యాంకునే ఏర్పాటు చేసింది. కరోనా నుంచి కోలుకున్నవారు ముందుకొచ్చి ప్లాస్మా అందిస్తే పేషెంట్లు కోలుకుంటారని ఆయన ప్రజలను కోరారు. వీటితోపాటు సర్కారు తీసుకుంటున్న పలుచర్యలతో ఢిల్లీలో కరోనా తోకముడవనుందా? అనే చర్చ నడుస్తున్నది.






