- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో వెయ్యికి చేరువలో కరోనా..!
<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. ఏపీలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం కరోనా నిరోధానికి అన్ని చర్యలు చేపడుతున్నామని చెబుతోంది. రోజూ ఐదు నుంచి ఆరు వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఘనంగా ప్రకటిస్తోంది. మరోవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వైద్యఆరోగ్యశాఖాధికారులు, పోలీసులు ఎన్ని చేసినా కరోనా మాత్రం కొలిక్కి రావడం లేదు. మరోవైపు కర్నూలు, గుంటూరు జిల్లాలు డబుల్ సెంచరీ కేసులు దాటేసి… దేశంలోనే అత్యంత వేగంగా […]</p>

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. ఏపీలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం కరోనా నిరోధానికి అన్ని చర్యలు చేపడుతున్నామని చెబుతోంది. రోజూ ఐదు నుంచి ఆరు వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఘనంగా ప్రకటిస్తోంది. మరోవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వైద్యఆరోగ్యశాఖాధికారులు, పోలీసులు ఎన్ని చేసినా కరోనా మాత్రం కొలిక్కి రావడం లేదు.
మరోవైపు కర్నూలు, గుంటూరు జిల్లాలు డబుల్ సెంచరీ కేసులు దాటేసి… దేశంలోనే అత్యంత వేగంగా కరోనా సోకుతున్న జిల్లాలుగా పేరుగడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 955కి చేరుకుంది. వారిలో 145 మంది డిశ్చార్జ్ కాగా, 29 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పుడు ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 781 అని ప్రకటించింది.
కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు డబుల్ సెంచరీ దాటేశాయి. దీంతో రాష్ట్రంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు గల జిల్లాలుగా ఈ రెండు జిల్లాలు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. నిన్న కర్నూలు జిల్లాలో 27 కేసులు నమోదు కాగా, గంటూరు జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు ఇప్పటి వరకు కరోనా బారిన 261 మంది పడగా, గుంటూరు జిల్లాలో 206 మందికి కరోనా సోకింది.
ఆ తరువాతి స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. నిన్న ఈ జిల్లాలో 14 మందికి కరోనా పాజిటివ్ తేలగా, ఈ జిల్లాలో కరోనా సోకిన వారి సంఖ్య 102 కి చేరుకుంది. చిత్తూరు జిల్లాలో 73 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 68 కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో 53, కడపలో 51, అనంతపురంలో 46, పశ్చిమ గోదావరిలో 39, తూర్పు గోదావరిలో 34, విశాఖపట్టణం జిల్లాలో 22 కరోనా కేసులు నమోదయ్యాయి.

Tags: corona virus, covid-19, andhrapradesh, health department






