మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. 5 జిల్లాల్లో లాక్‌డౌన్

by  |
మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. 5 జిల్లాల్లో లాక్‌డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి విజ‌‌ృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్త రకం కరోనా వల్ల మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహరాష్ట్రలో 240 రకాల కరోనా వైరస్‌లను గుర్తించారు అధికారులు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో వాటిని నియంత్రించేంచుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, యావత్మాల్ జిల్లాలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తు్న్నట్లు ఆదేశాలు జారీ చేసింది. నేటి రాత్రి నుంచి మార్చి 1 వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది. కాగా, నేటి నుంచి పూణె, నాసిక్ నగరాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. విద్యాసంస్థలను కూడా ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. కరోనా నియంత్రణకు టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్ తప్పదని నిపుణులు తెలుపుతున్నారు.


Next Story

Most Viewed