- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కరోనా @ 706
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఏపీలో వరుసగా పదో రోజు కూడా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో 793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక (113) పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుంటూరు (98), అనంతపురం (96), కర్నూలు (86), తూర్పుగోదావరి (72), కడప (71) తదితర జిల్లాల్లో మొత్తం 706 పాజిటివ్ […]</p>

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఏపీలో వరుసగా పదో రోజు కూడా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో 793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక (113) పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుంటూరు (98), అనంతపురం (96), కర్నూలు (86), తూర్పుగోదావరి (72), కడప (71) తదితర జిల్లాల్లో మొత్తం 706 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన 81 మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే ఇతర దేశాలకు చెందిన ఆరుగురికి కరోనా సోకింది. దీంతో మొత్తం 793 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 302 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా నిన్న ఒక్కరోజే 11 మంది మరణించడంతో ఇప్పటివరకు 180 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






