ఏ మాత్రం తగ్గడం లేదు..

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 55 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,719 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 759 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,903 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. సోమవారం [&hellip;]</p>

ఏ మాత్రం తగ్గడం లేదు..
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 55 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,719 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 759 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,903 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. సోమవారం తూర్పు గోదావరిలో మరొకరు మృతి చెందడంతో ఏపీలో మృతుల సంఖ్య మొత్తం 57కి చేరిందని తెలిపింది.

మరోవైపు విశాఖలో కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే వైజాగ్‌లో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతోన్నది. దీంతో వైజాగ్‌లో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 99కి చేరుకుంది. వందేభారత్ మిషన్‌లో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ఐదుగురు కరోనా బారినపడగా, అచ్యుతాపురం మండలం ఇరువాడ పంచాయతీ పరిధిలోని చిట్టిబోయినపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి వైరస్ సోకడం ఆ పరిసర ప్రాంతాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

Next Story