- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లేఖ ద్వారానే కాంగ్రెస్‌లో వివాదం: పీసీ చాకో
<p>దిశ, వెబ్ డెస్క్: నిన్న జరిగిన సీడీబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తలెత్తిన విషయం తెలిసిందే. సోనియా గాంధీకి సీనియర్ నేతలు లేఖ రాయడంపై రాహుల్ ఫైరైన విషయం విధితమే. ఈ తరుణంలో రాహుల్ పై సీనియర్ నేతలు కూడా మండిపడ్డారు. అనంతరం అజాద్ ఇంట్లో సీనియర్ నేతలంతా కలిసి సమావేశమయ్యారు. ఇలా ప్రస్తుతం కాంగ్రెస్ లో కోల్డ్ వార్ చిలికి చిలికి గాలి వానలా తయారైంది. అయితే, ఈ […]</p>

దిశ, వెబ్ డెస్క్: నిన్న జరిగిన సీడీబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తలెత్తిన విషయం తెలిసిందే. సోనియా గాంధీకి సీనియర్ నేతలు లేఖ రాయడంపై రాహుల్ ఫైరైన విషయం విధితమే. ఈ తరుణంలో రాహుల్ పై సీనియర్ నేతలు కూడా మండిపడ్డారు. అనంతరం అజాద్ ఇంట్లో సీనియర్ నేతలంతా కలిసి సమావేశమయ్యారు. ఇలా ప్రస్తుతం కాంగ్రెస్ లో కోల్డ్ వార్ చిలికి చిలికి గాలి వానలా తయారైంది.
అయితే, ఈ అంశంపై ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో స్పందించారు. ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వంలో కొన్ని విషయాలను సరిదిద్దాల్చిన అవసరం ఉంది. కానీ, సీనియర్ నేతలు ఆ విధంగా లేఖ రూపంలో తమ ఆలోచనను వ్యక్తపరచడం సరికాదు. ఆ లేఖ ద్వారానే వివాదం చెలరేగింది. సీడబ్ల్యూసీ సమావేశానికి ఒక్కరోజు ముందే ఇలా లేఖ రాయడం సరికాదు. సమావేశంలో వారి ఆలోచనలను పంచుకుంటే బాగుండు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో అన్నారు.






