ఒలింపిక్స్‌లో ట్రాన్స్‌జెండర్ వివాదం

by  |
Hubbard
X

దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ వెయిట్ లిఫ్టర్ లారెల్ హుబ్బార్ట్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఒలింపిక్స్ చరిత్రలో మొట్ట మొదటి ట్రాన్స్‌జెండర్ అథ్లెట్‌గా హుబ్బార్డ్ రికార్డు సృష్టించనున్నది. గతంలో కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా పాల్గొన్న హుబ్బార్డ్.. 2019లో పసిఫిక్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకొని సంచలనం సృష్టించింది. అయితే పురుషుడిగా జన్మించిన గావిన్ హుబ్బార్డ్ జూనియర్ లెవెల్లో పురుష అథ్లెట్‌గానే వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొన్నాడు.

అయితే 2012లో న్యూజీలాండ్ ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ ఆర్గనైజేషన్ సీఈవోగా ఉన్న సమయంలో తన లింగమార్పిడి చేసుకున్నాడు. అప్పటి నుంచి మహిళల కేటగిరీలో పాల్గొంటున్నాడు. దీనిపై ఇతర మహిళా వెయిట్ లిఫ్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హుబ్బార్డ్ తీరు వల్ల ఒక మహిళకు రావల్సిన పతకం ఇతరులకు వెళ్లిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా పవర్ లిఫ్టింగ్‌లో ట్రాన్స్‌జెండర్లను అమ్మాయిల కేటగిరీలో పరిగణించమని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హుబ్బార్డ్‌ను వెంటనే అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed