- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు..
<p>దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దొంగ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు రాజకీయ అవసరాల కోసం ఎంతవరకైనా దిగజారుతాడంటూ విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ..చంద్రబాబు తన మన అనే బేధం లేకుండా రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకుని నడిరోడ్డుపై వదిలేస్తాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు భార్య, కొడుకు, చెల్లి, మామ, బావ, బావమరిది ఇలా ఎవరూ అతనికి […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దొంగ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు రాజకీయ అవసరాల కోసం ఎంతవరకైనా దిగజారుతాడంటూ విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ..చంద్రబాబు తన మన అనే బేధం లేకుండా రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకుని నడిరోడ్డుపై వదిలేస్తాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు భార్య, కొడుకు, చెల్లి, మామ, బావ, బావమరిది ఇలా ఎవరూ అతనికి అవసరం లేదని అవసరానికి వాడుకుని ఆ తర్వాత నడిరోడ్డుపై తీసుకువచ్చి వదిలేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. చంద్రబాబు కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడిన కొడాలి నాని క్షమాపణలు చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది.
చంద్రబాబు సంచలన నిర్ణయం
Next Story






