మిషన్ భగీరథ పనుల్లో విషాదం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-19 08:32:33  IST  )

<p>దిశ, షాద్‌నగర్: మిషన్ భగీరథ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని బుచ్చిగూడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో మిషన్ భగీరథ పనులు జరుగుతుండగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంజత్ గుప్త(35)అనే కార్మికుడు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వ [&hellip;]</p>

మిషన్ భగీరథ పనుల్లో విషాదం
X

దిశ, షాద్‌నగర్: మిషన్ భగీరథ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని బుచ్చిగూడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో మిషన్ భగీరథ పనులు జరుగుతుండగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంజత్ గుప్త(35)అనే కార్మికుడు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story