- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ యూటర్న్ తీసుకుంటుండగా దారుణం.. ఒకరు మృతి
<p>దిశ, కామారెడ్డి : ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు యూటర్న్ తీసుకునే క్రమంలో వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి బైపాస్ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మహ్మద్ ఫార్మాన్ హుస్సేన్, సిరిపురం రాజు ఇద్దరు కలిసి పనిమీద రామేశ్వర్ పల్లి వెళ్లారు. పని పూర్తి […]</p>

దిశ, కామారెడ్డి : ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు యూటర్న్ తీసుకునే క్రమంలో వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి బైపాస్ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మహ్మద్ ఫార్మాన్ హుస్సేన్, సిరిపురం రాజు ఇద్దరు కలిసి పనిమీద రామేశ్వర్ పల్లి వెళ్లారు.
పని పూర్తి చేసుకుని రామేశ్వర్ గ్రామం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా బైపాస్ పై అటువైపుగా వెళ్తున్న కంటైనర్ బైకును వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హుసేన్ అక్కడికక్కడే మృతి చెందగా, సిరిపురం రాజు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అతడిని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






