- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తి
by Shyam |
<p>దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గంలోని ఎరుకల నాంచారమ్మ నగర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. 1.34 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు. ఇళ్ల నిర్మాణానికి భూమిని అప్పగించిన కుటుంబాలకు 154 ఇళ్లను కేటాయించామని తెలిపారు. మిగిలిన ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. బ్లాక్-ఏలో 216 ఇళ్లు, బ్లాక్-బిలో 72 ఇళ్లను రూ.24.91 కోట్ల వ్యయంతో నిర్మించామని పేర్కొన్నారు. ప్రతి […]</p>

X
దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గంలోని ఎరుకల నాంచారమ్మ నగర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. 1.34 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు. ఇళ్ల నిర్మాణానికి భూమిని అప్పగించిన కుటుంబాలకు 154 ఇళ్లను కేటాయించామని తెలిపారు. మిగిలిన ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. బ్లాక్-ఏలో 216 ఇళ్లు, బ్లాక్-బిలో 72 ఇళ్లను రూ.24.91 కోట్ల వ్యయంతో నిర్మించామని పేర్కొన్నారు. ప్రతి యూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.6.40 లక్షలు భరిస్తే, కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు మంజూరయ్యాయని వివరించారు.
Next Story






