- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షెడ్యూల్ కులాల్లో ఉపకులాలు ఉండొచ్చు..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్ : షెడ్యూల్ కులాల్లో ఉపకులాలు ఉండొచ్చని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఒక రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. పంజాబ్‌కు చెందిన కొందరు వ్యక్తులకు సంబంధించిన కేసులో ఈ విధంగా తీర్పునిచ్చింది. అయితే, 2004లో ఈవీ చిన్నయ్య అనే కేసులో షెడ్యూల్ కులాల్లో ఉపకులాలు అవసరం లేదని నాడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ ధర్మాసనం పేర్కొన్నది. కాగా, ఒకే అంశానికి సంబంధించి రెండు వేర్వేరు తీర్పులను రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించడంతో ఈ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ :
షెడ్యూల్ కులాల్లో ఉపకులాలు ఉండొచ్చని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఒక రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. పంజాబ్‌కు చెందిన కొందరు వ్యక్తులకు సంబంధించిన కేసులో ఈ విధంగా తీర్పునిచ్చింది.
అయితే, 2004లో ఈవీ చిన్నయ్య అనే కేసులో షెడ్యూల్ కులాల్లో ఉపకులాలు అవసరం లేదని నాడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ ధర్మాసనం పేర్కొన్నది. కాగా, ఒకే అంశానికి సంబంధించి రెండు వేర్వేరు తీర్పులను రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించడంతో ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
Next Story






