‘అంబేద్కర్ కలలుగన్న సమతా రాజ్యాం.. తెలంగాణ గడ్డ మీద బహుజన రాజ్యాం’

by  |

దిశ, శాయంపేట : భారత రాజ్యాంగం ఆమోదించబడి 72 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా DSP రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశానుసారం దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో రాజ్యంగదినోత్సవ వేడుకలను హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా DSP మండల అధ్యక్షులు మల్యాల అమరేందర్ మహారాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోని వంద కోట్ల ప్రజలను బీసీ, ఎస్సీ, ఎస్టీలను మనుషులుగా గుర్తించి అందరికీ సమానమైనటువంటి హక్కులను కల్పించిన రోజు అని, మనందరి జీవితం ఒక వెలుగులోకి వచ్చిన రోజు అని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగ పీఠిక తెలియజేస్తున్న విధంగా.. ఈ దేశంలో ప్రతి మనిషికి స్వేచ్ఛ,సమానత్వం,న్యాయం సోదర భావం అనే విలువలతో జీవించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలియజేయడం జరిగింది. అంబేద్కర్ కలలుగన్న సమతా రాజ్యాన్ని స్థాపించినట్టు తెలంగాణ గడ్డ మీద బహుజన రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా DSP అదినాయకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గత పన్నెండు సంవత్సరాల 2022 జనవరి 1వ తేదీ నుంచి 2023 మార్చి 15 వరకు 15 నెలలు 10 వేల కిలోమీటర్లు మహా పాదయాత్ర చేయబోతున్నారని, ఈ పాదయాత్రలో బహుజన కులాలు భాగస్వామ్యం కావాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాయంపేట మండల ప్రధాన కార్యదర్శి మధు మహారాజ్, మండల కమిటీ సభ్యులు రూపా మహారాణి, భాస్కర్ మహారాజ్ ,సాంబ రాజ్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story