ఇదేనా.. ఫ్రెండ్లీ పోలీస్..? యువకుడిని రబ్బర్ ట్యూబ్‌తో చితకబాదిన కానిస్టేబుల్..

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-23 12:04:38  IST  )

<p>దిశ, చార్మినార్​ : ఫ్రెండ్లీ పోలీస్​ అని.. పోలీస్​ స్టేషన్​కు చేరుకోగానే న్యాయం జరుగుతుందన్న భరోసా కలగాలని .. అలాంటి వాతావరణాన్ని క్రియేట్​ చేయాలని పోలీసు బాస్ పదే పదే చెబుతున్నా, కొందరు కింది స్థాయి పోలీసులు పోలీస్​ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్న ఘటన ఇది. అప్పుగా తీసుకున్న 1.50 లక్షలకు.. 5లక్షలు ఇవ్వాలని ఫిర్యాదు చేసిన ఫైనాన్సర్ పక్షాన నిలిచిన ఛత్రినాక పోలీసులు కొడుకును పోలీస్​స్టేషన్​కు తీసుకువచ్చి రబ్బర్​ ట్యూబ్​తో దాడి చేశాడు. పది రోజుల్లో [&hellip;]</p>

ఇదేనా.. ఫ్రెండ్లీ పోలీస్..? యువకుడిని రబ్బర్ ట్యూబ్‌తో చితకబాదిన కానిస్టేబుల్..
X

దిశ, చార్మినార్​ : ఫ్రెండ్లీ పోలీస్​ అని.. పోలీస్​ స్టేషన్​కు చేరుకోగానే న్యాయం జరుగుతుందన్న భరోసా కలగాలని .. అలాంటి వాతావరణాన్ని క్రియేట్​ చేయాలని పోలీసు బాస్ పదే పదే చెబుతున్నా, కొందరు కింది స్థాయి పోలీసులు పోలీస్​ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్న ఘటన ఇది. అప్పుగా తీసుకున్న 1.50 లక్షలకు.. 5లక్షలు ఇవ్వాలని ఫిర్యాదు చేసిన ఫైనాన్సర్ పక్షాన నిలిచిన ఛత్రినాక పోలీసులు కొడుకును పోలీస్​స్టేషన్​కు తీసుకువచ్చి రబ్బర్​ ట్యూబ్​తో దాడి చేశాడు. పది రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే రెండవ కోటింగ్​ ఉంటది.. కేసు బుక్​ చేస్తా నంటూ… సదరు యువకున్ని దగ్గర నుంచి పోలీసులు ఫోన్​ కూడా లాక్కొని వెళ్ల గొట్టిన ఘటన ఛత్రినాక పోలీస్​ స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది.

బాధితుడు మాణిక్యం తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఛత్రినాక మేనకా థియేటర్​ పరిసర ప్రాంతానికి చెందిన రాంచందర్​, జయమ్మలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. 2013లో కూతురు పెళ్లి నిశ్చయం అయ్యింది. చేతికి అందాల్సిన డబ్బులు రాకపోవడంతో రాంచందర్ సోదరి చంద్రమ్మ ఉప్పుగూడకు చెందిన జగదీష్​ అనే వ్యక్తి దగ్గర భూమికి సబంధించిన డాక్యుమెంట్లను పెట్టి 1.50 లక్షలను 3రూపాయల వడ్డీకి ఇప్పించింది. అప్పట్లో మేస్త్రీ పని చేసే రాంచందర్​ 2020 వరకు వడ్డీ చెల్లించాడు. 2020లో రాంచందర్​ మృతిచెందాడు. వడ్డీకి డబ్బులు ఇప్పించిన అత్త చంద్రమ్మ కూడా మృతిచెందింది. అయితే నాకు డబ్బులు అవసరమున్నాయని జగదీష్​ ఒత్తిడి చేయసాగాడు. మీరు డబ్బులు ఇవ్వకపోతే డ్యాకుమెంట్లను ఇంకొకరి దగ్గర పెట్టి నేను తెచ్చుకుంటానని హెచ్చరించాడు. అసలు ఇవ్వడానికి ఇంకా కొద్దిగా సమయం ఇవ్వాలని అభ్యర్థించారు.

దీంతో ‘నేను వేరే వాళ్ల దగ్గర పెట్టి 5లక్షలు తెచ్చుకున్నాను.. అతనికి డబ్బులిచ్చి డాక్యుమెంట్లను తీసుకోవాలి’ అని చెప్పాడు జగదీష్. అంతేకాకుండా శనివారం రాత్రి ఛత్రినాక పోలీస్​ స్టేషన్​ కానిస్టేబుల్​ నీ మీద ఫిర్యాదు వచ్చింది.. పదా పోలీస్​స్టేషన్​ కంటూ జయమ్మ కుమారుడు మాణిక్యం(24) కు తీసుకెళ్లాడు. మాణిక్యం, తన అమ్మ జయమ్మ, వరుసకు సోదరుడైన రాజాతో కలిసి ఛత్రినాక పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. అక్కడ కానిస్టేబుల్​ తన ప్రతాపం చూపెట్టాడు. తీసుకున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అంటూ దుర్భాషలాడారు. డబ్బులు తాను తీసుకోలేదని, తండ్రి తీసుకున్నాడని అతని చనిపోయాడు.. కాస్త సమయం ఇవ్వాలని సమాధానం ఇచ్చిన మాణిక్యంను ఒక గదిలోకి తీసుకు వెళ్లి రబ్బరు ట్యూబ్​తో చేతులపై దాడి చేశారు పోలీసులు. వాతలు వచ్చేలా కొట్టాడు. బూటు కాలితో తన్నాడు. పోలీస్​స్టేషన్​లో ఉన్న తల్లి దగ్గరికి వచ్చి పోలీసులు రబ్బరు ట్యూబ్​తో తనను చితక బాదారని బోరుమన్నాడు. సివిల్​ కేసులో తన కొడుకును కొట్టే అధికారం మీకెవ్వరిచ్చారని అడిగిన జయమ్మను దుర్భాషలాడారు. ఫోన్​ లాక్కుని ఇది మొదటి కోటింగ్​ .. డబ్బులు 10 రోజుల్లో ఇవ్వకపోతే సెకండ్​ కోటింగ్​ ఉంటదని, పోలీసులు హెచ్చరించి వెళ్లగొట్టారు.

Next Story