బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం.. చితకబాదిన స్థానికులు

165

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో బాలికపై వడ్డే శేఖర్ అనే కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కానిస్టేబుల్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. శంకర్ పల్లికి చెందిన వడ్డే శేఖర్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.